Maddelacheruvu suri biography telugu version vadena

Maddelacheruvu Suri Murder Case: మద్దెలచెర్వు సూరి మర్డర్ కేసు - 12 ఏళ్ల తర్వాత నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్

Maddelacheruvu Suri Murder Case Offender Got Bail: ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూరి (Maddelachervu Suri) హత్యకేసులో నిందితుడు భానుకిరణ్ (Bhanukiran) బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకి హైదరాబాద్ నాంపల్లి కోర్టు (Nampally Court) బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో దాదాపు 12 ఏళ్ల తర్వాత బెయిల్ మంజూరు కాగా.. చంచల్ గూడ జైలు నుంచి రిలీజయ్యారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడేందుకు భాను నిరాకరించారు. కాగా, 2011లో మద్దెలచెర్వు సూరి హత్య జరిగింది. ఆయన కారులో వస్తుండగా హైదరాబాద్ సనత్‌నగర్ నవోదయ కాలనీలో సూరిని భానుకిరణ్ రివాల్వర్‌తో కాల్చిచంపాడు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌కు 2018 డిసెంబరులో నాంపల్లి కోర్టు జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న భానుకిరణ్.. తనకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాడు.

ఉమ్మడి ఏపీలో అప్పట్లో ఈ కేసు సంచలన సృష్టించింది. ఈ కేసులో భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది.

మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య తర్వాత సూరి కూడా అనుచరుడైన భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు. యూసుఫ్‌గూడ మీదుగా వెళ్తున్న కారులో వెనుక సీటులో కూర్చున్న నిందితుడు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో సూరిని తలపై కాల్చి చంపేశాడు. ఈ ఘటన ఉమ్మడి ఏపీలో తీవ్ర సంచలనం కలిగించింది. సూరి జైల్లో ఉన్న సమయంలో వసూలు చేసిన డబ్బుల పంపకం విషయంలో తలెత్తిన వివాదంతో అనుచరుడే హత్య చేసినట్లు ప్రచారం సాగింది.

సూరిని పథకం ప్రకారమే హత్య చేశారని అతని భార్య గంగుల భానుమతి చాలాసార్లు ఆరోపించారు.

సూరి హత్య కేసులో భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ 2018 డిసెంబరులో కింది కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని భాను హైకోర్టులో అప్పీల్ చేశాడు.

Lloyd carr michigan football tickets

పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని భాను తరఫు లాయర్ వాదించగా.. పథకం ప్రకారమే సూరిని నిందితుడు హత్య చేశాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. హత్య జరిగిన రోజున సూరితో పాటు నిందితుడు భాను అదే కారులో ప్రయాణించాడని కోర్టుకు తెలిపారు.

Letra 22 abriles tengo isabel pantoja biography

వెనుక సీట్లో కూర్చుని పథకం ప్రకారమే కాల్చి చంపాడని చెప్పారు. హత్య అనంతరం మధ్యప్రదేశ్ పారిపోయాడని.. పోలీసులు గాలించి పట్టుకున్నారని పేర్కొన్నారు. పీపీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం భాను అప్పీల్‌ను కొట్టేసింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను తెలంగాణ హైకోర్టు ఖరారు చేసింది. 12 ఏళ్లుగా భాను జైల్లోనే ఉంటున్నాడు.

తాజాగా, నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.

Also Read: Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు

Also Read: Kadapa SP Transfer: కడప ఎస్పీపై బదిలీ వేటు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం వహించారనే !

మరిన్ని చూడండి